ఆదివారం, సెప్టెంబర్ 10, 2017

ఇది సంగీత సంగ్రామమూ...

పక్కింటి అమ్మాయి చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి ??
గానం : బాలు, చక్రవర్తి

ఇది సంగీత సంగ్రామమూ
ఇది సంగీత సంగ్రామమూ
స్వర కిరీటినీ.. లయ విరాట్టునీ
సరస సంగీత చక్రవర్తినీ..

ఇది సంగీత సంగ్రామమూ 
శృతికి మేటిని గతికి పోటిని
బాల గంధర్వ నామ కీర్తినీ

ఇది సంగీత సంగ్రామమూ

శంకరాభరణ రాగంలో డొంకలు తిరిగే పాండిత్యం
వంకర టింకర తాళంలో వంకరబోయే సాహిత్యం
శివశంకర నటరాజ భాగవత సంగీతం అని తెలుసుకో
అది చస్తే రాదని ఇట్టే పోదని తెలుసుకో మసలుకో

ఇది సంగీత సంగ్రామమూ..

స్పందించే నా హృదయంలో సుడి రేగిందొక తాళం
నినదించే నా నాడులలో చెలరేగిందొక రాగం
నీ శశభిషలకు నీ బెకబెకలకు తిరిగిపోదులే ఈ గానం
మడిచి పెట్టు ఇక విడిచిపెట్టు నీ పిలకజుట్టు సంగీతం
శివశంకరా యమకింకర ఇంక ఆపరా...ఆఅ...

ఇది సంగీత సంగ్రామమూ..

వినరా బాల ఆపర గోలా
స్వర గురువును నేనని తెలుసుకో
బాలుడనైనా లఘువును కానని తెలుసుకో 
నీ పాటకు దరువును బరువుగ నీవే దిద్దుకో
ఇంతకు నీదే గ్రామం..
అది సంగీతానికి సాలగ్రామం

ఇది సంగీత సంగ్రామమూ..


2 comments:

దశాబ్దాలుగడుస్తున్నా..సంగీతప్రియులైన ప్రేక్షకశ్రోతలగుండెల్లో శాశ్వతస్థానం ఖరారుచేసుకున్న పాట..తీపిని నాల్కలే కాదు చెవులూ గుర్తించికీర్తిస్తాయని నిరూపించిన సంగీతచక్రవర్తి కనిపించి వినిపించిన సంగీతపు వీనులకనుల నాలుకల మనసులవిందు

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.