శుక్రవారం, ఫిబ్రవరి 12, 2021

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)
సంగీతం : గోపీ సుందర్ 
సాహిత్యం : సురేంద్ర కృష్ణ  
గానం : సిధ్ శ్రీరామ్  

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..
నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళాతావే మ‌న‌సా..

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశా

నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కడుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 
మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా

నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.