సోమవారం, ఫిబ్రవరి 01, 2021

అదేదో మాయల్లే...

యుద్ధంశరణంగచ్ఛామి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : యుద్ధంశరణంగచ్ఛామి (2017)
సంగీతం : వివేక్ సాగర్  
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ    
గానం : ట్రేసీ థార్టన్

అదేదో మాయల్లే 
అలా అలా అల్లిందా 
ఎద ఎదో లోయల్లో 
ఇలా జారింది మెల్లగా 

ఆ ఆ ఆకాశం వాలే 
కళ్ళలోన దాగితే 
చూపుల్లో చూపే 
అలాగే మెరుపు తీగల్లె 

ఆ అందాలే 
అమర్చి చూపిందా 
సూదల్లే గుండె 
గుచ్చి గుచ్చి చంపుతూ

కంగారే దాహంగా మారిందా 
గుటక వేసి చూస్తుంటే 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 

అయ్యో అయ్యో చెయ్యి జారుతున్నా 
ప్రాణం తానే అందుకుందా 
ఏదో ఏదో హాయి చేరుతున్నా 
తీరే కొత్తగా తోచిందా 

సైగలో దాగిన భావం తెలియాలంటే 
భాషకే అందని విధంగా మనమే చేరి 
ఈ పెదవిపై తాకేలా 

మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
ఏదో ఊహలతో సద్దుకుందిగా
 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.