బుధవారం, ఫిబ్రవరి 24, 2021

ఏమిటో ఇది...

రంగ్ దే చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : కపిల్ కపిలన్, హరిప్రియ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

అలలా నా మనసు తేలుతుందే
వలలా నువు నన్ను అల్లుతుంటే
కలలా చేజారిపోకముందే
శిలలా సమయాన్ని నిలపమందే
నడక మరిచి నీ అడుగు ఒడిన 
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన 
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో
కలిపే ఒక కొత్త నిన్ను నాతో
నేనే ఉన్నంత వరకు నీతో
నిన్నే చిరునవ్వు విడువదనుకో
చినుకు పిలుపు విని 
నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని 
చిన్ని మనసు చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.