సోమవారం, ఫిబ్రవరి 22, 2021

మనసున ఎదో రాగం...

ఎంతవాడు గాని చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఎంతవాడు గాని (2015)
సంగీతం : హారీస్ జైరాజ్ 
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్ 
గానం : చిన్మయి 

మనసున ఎదో రాగం 
విరిసేను నాలో తేజం
చెప్పలేని ఎదో భావం నాలో కలిగేలే

సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా 
మునిగే మనసు అస్సలు బెదరలేదు లే

ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు 
ననువిడి వెళిపోవుట నేను చూసానే 
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి 
కలలో కలలో నను నేనే చూసానే

నాకేం కావాలి నేడు 
ఒక మాట అడిగి చూడు 
ఇక నీవే నాకు తోడూ 
అని లోకమనేదెపుడు

నాకేం కావాలి నేడు 
ఒక మాట అడిగి చూడు 
ఇక నీవే నాకు తోడూ 
అని లోకమనేదెపుడు
 
దోసిట పూలు తేచ్చి ముంగిట ముగ్గులేసి 
మనసును అర్పించగా ఆశ పడ్డానే 
వలదని ఆపునది ఏదని అడిగే మది 
నదిలో ఆకు వలే కొట్టుకుపోయానే 
గరికలు విరులయ్యే మార్పే అందం 
ఎన్నో యుగములుగా మెలిగిన బంధం

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగెనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటినిపుడు

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగెనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటినిపుడు
 
మనసున ఎదో రాగం 
విరిసేను నాలో తేజం 
చెప్పలేని ఎదో భావం నాలో కలిగేలే 
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా 
మునిగే మనసు అస్సలు బెదరలేదులే 
ఉన్నది ఒక మనసు వినదది నాఊసు 
నను విడి వెళిపోవుట నేను చూసానే 
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి 
కలలో కలలో నను నేనే చూసానే

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగేనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటి నిపుడు
  

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.