గురువారం, ఫిబ్రవరి 18, 2021

జల జల జలపాతం...

ఉప్పెన చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఉప్పెన (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : జస్ ప్రీత్, శ్రేయాఘోషల్  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరుఅలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

హే... మన జంటవైపు 
జాబిలమ్మ తొంగి చూసెనే
హే... ఇటు చూడకంటూ
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుందీ లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఎలాగ బైటపడుతోంది ఈవేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్నూ
నీ నుంచి నన్నూ 
తెంచలేదు లోకం  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజూ
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్లు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఏక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను 
మనకు మనమే సొంతం 

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.