ఆదివారం, డిసెంబర్ 26, 2010

సిరిమల్లె నీవే - పంతులమ్మ(1977)

కొన్ని పాటలకు పాతబడడమంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తుంది. పంతులమ్మ సినిమాలో రాజన్ నాగెంద్రగారు స్వరపరిచిన ఈ పాట వినండి. ఎన్ని సార్లు విన్నా ఆ తాజాదనం ఎక్కడికీ పోదు.. ఎప్పటికప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉంటుంది, ఊహల్లో విహరింప జేస్తుంది... వేటురి గారు సాహిత్యమందించిన ఈ పాట బాలుగారి స్వరంలో అందంగా రూపుదిద్దుకుంది. తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది... సంధ్యా సమయం లో మంద్రమైన స్వరంలో ఈ పాట వింటూ అలా ఊహల్లో జారుకోవడం నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఈ పాట వీడియో మీ కోసం... యూట్యూబ్ చూడలేని వారు చిమట లో ఇక్కడ పాట మాత్రం వినవచ్చు.


చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
 
అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

5 comments:

వేణు,

మంచి పాట అందించారు. ఈ పాటలన్నీ రేడియో లో వింటూ..ఎవరి కి వాళ్ళం ఒక సుశీలనో, జానకి నో అనుకుంటూ మనకు మనమే పైకి పాడేసుకుంటూ....కొన్ని మధురమైన స్మృతుల్ని తట్టి లేపారు.
నాకు కూడా ఎప్పటి నుంచో సినిమాల గురించి, సినిమా పాటల గురించి ఒక సేపరేట్ బ్లాగ్ పెట్టి రాయాలని ఉంది. కానీ మీ అందరివి చూశాక, మీవి చదివితే చాల్లే మళ్ళీ వేరే బ్లాగ్ ఎందుకు అని సంతృప్తి పడిపోతుంటాను.

కల్పన

బాలూగారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటండి ఇది.

>>> తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది...

అవునండి. భలే పాడతారు ఆయన. సాహిత్యం కూడా అద్భుతం.

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

కల్పన గారు నెనర్లు. అలా అనుకుంటే ఎలాగండి ఒక్కొక్కరు ఆస్వాదించే తీరు ఒక్కోలా ఉంటుంది కనుక మీరు కూడా ఓ బ్లాగ్ మొదలెట్టేసి మీ అభిప్రాయలతో పరిచయం చేసేయండి.

శిశిర గారు నెనర్లు.

తృష్ణ గారు నెనర్లు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.