మంగళవారం, నవంబర్ 24, 2020

నీవెంత నెరజాణవౌరా...

జయభేరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : మల్లాది
గానం : ఎం.ఎల్.వసంత కుమారి 

నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. 
సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. 
సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 

తేనెలు చిలికించు గానము వినగానే...
తేనెలు చిలికించు గానము వినగానే... 
ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  

చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...

సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... 
ఇదే సరాగమా నవమదన

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  

బాలను లాలించి ఏలుట 
మరియాద కాదన వాదౌనురా.. 
స్వామీ
బాలను లాలించి ఏలుట 
మరియాద కాదన వాదౌనురా..

మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా

వన్నె చిన్నె గమనించవేలరా... 
వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... 
నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. 
యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర 
పరమ రసిక శిఖామణి...

నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. 
సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.