బుధవారం, నవంబర్ 04, 2020

ప్రియతమా రాధికా...

పెళ్ళికాని పిల్లలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

 
చిత్రం : పెళ్ళికాని పిల్లలు (1961)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

ప్రియతమా రాధికా 
ప్రియతమా రాధికా రావే 
రయమున కలియవె ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా రావే
రయమున కలియవె ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా

పరువము నీ మేన పరుగులు తీయా  ఆ..ఆ..ఆ..  
పరువము నీ మేన పరుగులు తీయా
చరణాల కింకిణులు స్వరమేళ పాడా
చరణాల కింకిణులు స్వరమేళ పాడా 

ప్రియతమా రాధికా రావే
రయమున కలియవె, ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా 

కడవ నిడుకొనీ, కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకీ
కడవ నిడుకొనీ, కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకీ
అడుగులు తడబడ నడుమల్లాడా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
అడుగులు తడబడ నడుమల్లాడా
వడి వడిగ నడిచేటి వనితా లలామా

ప్రియతమా రాధికా….రావే
రయమున కలియవె ప్రేమాభిసారిక 
ప్రియతమా రాధికా….
ఆ ఆ ఆ… ప్రియతమా రాధికా 
ఆ ఆ ఆ… ప్రియతమా రాధికా 
ఆఆఆ ఆఆఆ..

నిరిరి నిగరిరిమ,  గమగ గదమమని 
గారిసనిద, సానిదపమ, దాపమగరి
గమదని, గరిసనిదని, గరిగరినిదనిద, 
గరిసనిదప, మదపమగరిగరిసని 

ప్రియతమా రాధికా రావే, 
రయమున కలియవె ప్రేమాభిసారిక 
ప్రియతమా రాధికా….ఆ..ఆ..ఆ
ప్రియతమా రాధికా... 
రాధికా, రాధికా..ఆఆ… 
 

2 comments:

చాలా మంచి పాట వేణూ ఇది

మాస్టర్ వేణు,ఘంటసాల కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ పీస్ ఇది

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ సుజాత గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.