సోమవారం, నవంబర్ 23, 2020

సుందరాంగ అందుకోరా...

భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్.సుదర్శన్, ఆర్.గోవర్ధన్
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల

సుందరాంగ అందుకోరా 
సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని 
ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా 

సుందరాంగ అందుకోరా 
సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని 
ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా 

కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేర రారా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేర రారా

సుందరాంగ అందుకోరా 
సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని 
ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా

యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై 
చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై 
చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం 
ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం

సుందరాంగ అందుకోరా 
సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని 
ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా

సుందరాంగా అందుకోరా.. సుందరాంగా అందుకోరా 
సుందరాంగా అందుకోరా.. సుందరాంగా అందుకోరా 
సుందరాంగా అందుకోరా.. సుందరాంగా అందుకోరా 
సుందరాంగా అందుకోరా.. సుందరాంగా అందుకోరా 
సుందరాంగ సుందరాంగ సుందరాంగ
ఓం నమశ్శివాయ.. 
ఓం నమశ్శివాయ.. 
ఓం నమశ్శివాయ..



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.