మంగళవారం, నవంబర్ 17, 2020

ప్రియుడా పరాకా...

అగ్నిపూలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అగ్నిపూలు (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : సుశీల

ప్రియుడా పరాకా 
ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు 
వలచి వస్తే పరాకా

ప్రియుడా పరాకా 
ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు 
వలచి వస్తే పరాకా

మిసమిసలాడే 
ఈ మేనురా నీదేనురా
రారా చెరగనీకు 
చిలిపి కంటి కాటుకా  

ప్రియుడా పరాకా 
ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు 
వలచి వస్తే పరాకా

ఒంటి నిండా ఒంపులూ 
కంటి నిండా మెరుపులూ
ఓపలేని విరహవేదన 
వేడి బుసలూ
వయసు వగలసెగలు 

ఒంటి నిండా ఒంపులూ 
కంటి నిండా మెరుపులూ
ఓపలేని విరహవేదన 
వేడి బుసలూ 

హా..హా.. తాళజాలరా ..
హా..హా.. జాలమేలరా
జరగరానీ.. 
నా కోరికా.. నా వేడుకా.. 
నీతో తీరకుంటే 
ఏలరా నా పుట్టుకా

ప్రియుడా పరాకా 
ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు 
వలచి వస్తే పరాకా

నన్ను నీవు రమ్మనీ 
నీకు నాపై ప్రేమనీ
రెచ్చగొడితే.. 
సోకులన్నీ చేసుకుంటిని 
నిన్నే చేరుకుంటిని

నన్ను నీవు రమ్మనీ 
నీకు నాపై ప్రేమనీ
రెచ్చగొడితే 
సోకులన్నీ చేసుకుంటిని
హా..హా.. చూడవేమిరా..
హా..హా.. పాడి కాదురా..

చులకనయ్యానా 
ఇంతలో నీ చూపులో
లేరా లేత వలపు 
పూతకొచ్చెను చూడరా

ప్రియుడా పరాకా 
ప్రియతమా పరాకా
వన్నె తేలిన కన్నెనాగు 
వలచి వస్తే పరాకా
వలచి వస్తే పరాకా

అమరమైనది అనురాగమూ
అమరులౌతామూ 
ఈ నాడు మనమూ 
ప్రియా.. ప్రియా.. 
ప్రియతమా..
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.