శనివారం, జులై 12, 2014

సాయీ శరణం బాబా శరణం

ఈ రోజు గురుపౌర్ణమి సందర్బంగా షిరిడీ సాయిబాబా పాటలన్నిటిలోకి నా మనసుకు బాగా నచ్చిన ఈ పాట మీకోసం. ఇళయరాజా ఈ పాటకు సమకూర్చిన మధురమైన సంగీతం మనసుకు హత్తుకుపోతుంది. ఇక ఏసుదాస్ గారి స్వరం కనులముందు బాబా సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : కె.జె.యేసుదాసు

హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం శరణం శరణం

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
 ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు 

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
 ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసికొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
విద్య దాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణ
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
 భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం 
 భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం 

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
 ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే



2 comments:

ఈ పాట ముందు వరకూ యేసుదాస్ గారి గొంతులో సరస్వతీ అమ్మ, శబరిమల స్వామి కొలువై వున్నారనిపించేది..అయినా నా అమాయకత్వం కాకపోతే, అమృతానికి రూపముంటుందా..ఆధారం లో ఇమిడి పోవటం తప్ప..

"అమృతానికి రూపముంటుందా..ఆధారం లో ఇమిడి పోవటం తప్ప.."
ఎంత బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.