మంగళవారం, జులై 15, 2014

ఐతే..అది నిజమైతే...

చిరంజీవి కమర్షియల్ బాటనుండి అపుడపుడు బయటకు వచ్చి చేసిన అతి కొన్ని సినిమాలలో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ శుభలేఖ ఒకటి, ఇందులోని పాటలన్నీ బాగుంటాయి. వాటిలో ఒక చక్కని పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : శుభలేఖ (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ.. నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా..
కలువ భామ అది వింటే పున్నమిగా
ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...
చందమామ అవునంటే వెన్నెలగా..
కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి 
తలంబ్రాలుగా కురిసే వేళా..చేరువైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

లాలలాలా..లాలలాలా..లాల..
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం ..
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...
ఆకసాన అరుధంతీ నక్షత్రం ..
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసందెలు కుంకుమలై కురిసీ 
నుదుట తిలకమై మెరిసే వేళా..చేరువైతే..

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
లలలలలలలాల నిజమైతే
లలలలలలలాల అదే నిజమైతే..
 

2 comments:

ఈ సినిమా చిరంజీవి ఇమేజ్ చట్రం లో ఫ్రేం కాక ముందు వచ్చిన మూవీ కాబట్టే విశ్వనాధ్ గారు తన కధకనుగుణం గా ఆ కారెక్టర్ ని మలచ గలిగారు..అందుకేనేమో సాంగ్స్, టేకింగ్ యాస్ యూజువల్ గా అద్భుతం గా వున్నా, ఆ తరువాత వచ్చిన స్వయంకృషి, ఆపద్భాంధవుడు అంత టచింగ్ గా లేవనిపిస్తుంది నాకు..

కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.