బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం సినిమాకోసం జొన్నవిత్తుల గారు రాసిన ఒక సరదా అయిన పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రాధాగోపాళం (2005)
సంగీతం: మణి శర్మ
రచన : జొన్నవిత్తుల
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
అహో
విశ్వప్రేమ ప్రభాదివ్య సౌందర్య మాధుర్య సౌశీల్య
సాఫల్య సౌగుణ్య లావణ్య సమ్మోహినీ..
నాకు అర్ధాంగిగా నీవు భూలోకమున్ జేర
విభ్రాంత దిగ్భ్రాంత సుస్వాగతంబిచ్చితిన్ నిచ్చెలీ.. హా
సహో..ఒహో..
గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా
కావు కావుమని తపస్సు చేసి..దేహి దేహి అని దేవులాడితి..
దేవుడు ఇచ్చిన పెండ్లమా..ముద్దుల మిఠాయి పొట్లమా
అరెరే ఎర్రని పెదవులు.. మ్.హా
మెత్త మెత్తగా..గట్టి గట్టిగా..
మీగడ కట్టిన అమృతపు ముక్కలూ
పగడపు చిగురుల పెదవులు..
నా ప్రేమకి దొరికిన పదవులు
అబ్బబ్బో బుగ్గలు..వారెవా ఏం సిగ్గులు
పాల్కోవాలు..మాల్కోవాలు..మందారాలు..
బాదం పాలు..హుందాతనము..ఆరిందాతనము..
చిందులు వేసే చెక్కిళ్ళు..ఔరా
గోరు చిక్కుళ్ళు..ముద్దుతో నూరు నొక్కుళ్ళూ
కోటేరులా ఉండి కొట్టొచ్చినట్టున పట్టుదల పుట్టైన ముక్కు..
బుసలు కొట్టుట తనకు హక్కు !
నిక్కచ్చిగా భలే నిక్కు..కొనవంపులో ఉంది టెక్కు
కిల కిల కిల కిల నవ్విన చాలు..
తలలే వంచును ఇలలో పూలు
నవరత్నాలీ నవ్వుల ముందర నివ్వెరబోయే గవ్వలు
వన్నెలు చిలికి వెన్నెలు తీసే చిన్ని కవ్వమా నడుమా..
మదన మాన్యమా..శూన్యమా.. శూన్యమా..
కారబ్బంతుల పారాణులతో కళ కళ లాడే పదములు
భరత మహాముని గుండె సవ్వడుల తైతక ధిమి తక రిధములు
దాసుని తప్పుని దండించే..ధాం ..ధూం..ధాం .. ఆయుధములు !
స్వాగతం ..సుస్వాగతం .. స్వాగతం ..సుస్వాగతం
2 comments:
జింతాత్తా అని రసిన పెన్నే గ్రహణం పట్టిన రాసిందంటే..జొన్నవిత్తుల గారి కలానికి రెండు వైపులా పదునే కదండీ..
అవును శాంతి గారు కరెక్టే.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.