గురువారం, జులై 10, 2014

రాసలీల వేళ...

ఈ పాటలోని ఇళయరాజా గారి మధురమైన సంగీతం బాలు జానకి గార్ల గాత్రం కలిసి మనసును ఆనంద డోలలూపేస్తుంది. మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల

కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని

రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల

మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు

రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ రాయబారమేల

 

4 comments:

వాటె సాంగ్ వేణూజీ..సెంచరీలు కొట్టే వయస్సు మాదీ అంటూ మనసు టైం మెషిన్ లో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపొయింది..

థాంక్స్ శాంతి గారు..

అవునండీ ఇద్దరికి ఇద్దరూ అద్భుతం. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.