శుక్రవారం, జులై 25, 2014

తనేమందో అందో లేదో...

మిక్కీ జె.మేయర్ మొదట్లో సంగీతం అందించిన పాటలలో ఓ చక్కని పాట ఇది. గణేష్ సినిమా లోనిది.. ఇందులో పల్లవి అవగానే 'ననననన' అంటూ వచ్చే బిట్ నాకు నచ్చుతుంది. మెల్లగా పారే సెలయేరు మధ్యలో రాళ్ళెక్కువై ఇరుకైన చోట వడిగా ప్రవహించినట్లు పాటంతా మెల్లగా సాగుతూ ఆ బిట్ మాత్రం జలపాతపు హోరులా వినిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గణేష్ (2009)
రచన : సిరివెన్నెల
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : జావేద్ అలీ

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది
లైఫంతా నాతో ఇలాగే ఉంటావా?

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో
ఈ వెలుగును దాచాలంటే...
పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో
మనసంతా ప్రేమైపోతే...
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో
మైమరపున నే నిలుచుంటే...
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

ఇదే క్షణం శిలై నిలవనీ
సదా మనం ఇలా మిగలనీ
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో... మదేం విందో...

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా

2 comments:

జావేద్ ఆలి..సిరివెన్నెలగారి పదాలని కళ్ళతో తాగేసి గుండెల్లో పొదువుకుని పెదాలతో పలికించారు..

అవును శాంతి గారు.. తను చాలా బాగా పాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.