సోమవారం, జులై 28, 2014

గోగులు పూచే గోగులు కాచే...

బాపు గారి సినిమాల్లో పాటలంటేనే అచ్చతెలుగుదనం ఉట్టిపడుతుంటుంది ఇక సినారేగారి మాటలలో కె.వి.మహదేవన్ గారి సంగీతంలో వచ్చిన పాటంటే చెప్పాల్సిన పనేముంది. వారి కాంబినేషన్ లో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల, కోరస్

గోగులు పూచే..గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచే..గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి 
ఓ లచ్చ గుమ్మాడి..ఈ..ఈ ఓ లచ్చ గుమ్మాడి 
 
పొద్దు పొడిచే పొద్దు పొడిచే..ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే..ఓ లచ్చా గుమ్మాడి 

 పొద్దు పొడిచే పొద్దు పొడిచే..ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే..ఓ లచ్చా గుమ్మాడి

పొద్దు కాదది.. నీ..ఈ..ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే..ఏ..సుమా..ఆ
పొద్దు కా..ఆ.దది.. నీ..ఈ..ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే..ఏ..సుమా..ఆ
వెలుగులు కావవి..నీ పాదాలకు అలదిన పారాణీ..
ఆహ..
హ..జిలుగులే సుమా..ఆ..ఆ

ముంగిట వేసిన ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి

ముంగిట వేసిన ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి

ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పా..ల కడలియే సుమా..ఆ
ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పా..ల కడలియే సుమా..ఆ
ముగ్గులు కావవి..నా అంతరంగాన పూచిన రంగవల్లులే..ఏ..ఏ..సుమా..ఆ..ఆ

మల్లెలు పూచే మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..
మల్లెలు పూచే మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..

మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ
మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ
వెన్నెల కాదది వేళ తెలిసి..ఆ జాబిలి వేసిన పానుపే..ఏ..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ..ఆ
 
2 comments:

అలనాటి రామాయణాన్ని సోషలైజ్ చేసిన డైరెక్టర్స్ యెందరో..బట్ నాటి సీత నించీ నేటి సీత వరకూ స్త్రీ హృదయాన్ని హృద్యంగా చూపించ గలిగినది మన బాపూగారొక్కరే..

కరెక్ట్ శాంతి గారు బాపు గారి గురించి బాగా చెప్పారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.