జంధ్యాల గారి రెండు రెళ్ళు ఆరు సినిమాలోని ఓ మంచి పాట మీకోసం. ఇందులో వేటూరి గారి సాహిత్యం బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1986)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో
ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో..దరఖాస్తందుకో..
ప్రే మ దరఖాస్తందుకో
ప్రే
చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా
ఆఆఆ.ఆఆఆఆ...ఆఆఆఆఅహాహా..
జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా
శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !
కాస్తందుకో..ఆఆ..దరఖాస్తందుకో..
హహ.. భామ దరఖాస్తందుకో
చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా
ఆఆఆఆఆహాహ్హా...ఆఆఆఆ లాలలలా...
నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా
దరిచేరి కూడా దరఖాస్తులేలా !
కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో
ఆహహ కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రే
2 comments:
'కిస్ ఈజ్ ద కీ ఆఫ్ లవ్..
లవ్ ఈజ్ ద లాక్ ఆఫ్ లైఫ్'..ఈ తియ్యటి నిజాన్ని యెంతమంది కవులు యెంత మంది కవులు యెన్ని భాషల్లో వర్ణించినా యెప్పటికీ బోర్ కట్టదు..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.