శుక్రవారం, జులై 11, 2014

చల్తీకా నామ్ గాడీ...

వంశీ మార్క్ తమాషా చిత్రీకరణతో ఇళయరాజా గారి గమ్మత్తైన సంగీతంతో ఆకట్టుకునే పాట చెట్టుకింద ప్లీడర్ సినిమాలోని ఈ పాట, నాకు బాగా ఇష్టమైన ఈ పాట మీరూ చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం : ఇళయరాజా
రచన : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా

దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుద్దంలోన వాడింది ఈ కారు
శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు
చరిత్రల లోతులు చేరి రాతలు మారి
చేతులు మారినదీ జంపరు బంపరు
బండి రా బండిరా జగమొండి రా మొండి రా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..

ఆంగ్లేయులు తోలిన కారు ఆంధ్రానే ఏలిన కారు
అందాల లండన్ కారు అన్నింటా ఎమ్డెన్ కారు
బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
హుషారుగ ఎక్కినా చాలు 
దక్కును మేలు చిక్కు సుఖాలు 
ఇదే సూపరు డూపరు బండి రా బండి రా
జగమొండి రా మొండి రా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..


2 comments:

స్వర రాగ గంగా ప్రవాహాలూ..సడి చేసే గోదారి అందాలూ వంశీ-ఇళైరాజా గారి కాంబినేషన్ లోనే సాధ్యం..

వారిరువురి కాంబినేషన్ గురించి చాలా బాగా చెప్పారు శాంతి గారు థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.