రాగమాలిక సినిమాకోసం ఇళయరాజా గారు స్వరపరచిన మరో చక్కని పాట ఇది, అచ్చంగా నదీప్రవాహంలా ప్రశాంతంగా హాయిగా సాగిపోతూ మధ్యలో ఉన్నట్లుండి స్వరాలతో వేగాన్నందుకుని తిరిగి మంద్రంగా సాగడం బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రాగమాలిక(1982)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ |
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం
ఒక దేవతోత్సవ తోరణం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
జలకమాడే కురులలో
తన తనువు నిలిపే దేవతా
అలల మెరిసే మేనిలో
ఇవి బ్రహ్మ దేవుని సొగసులో
యవ్వనాలే పువ్వులై
ఎద హత్తుకోనీ ప్రేమలై
యదను కురిసే హాఅ..ఆఅ...
యదను కురిసే వెన్నెలా..
నువ్వు నిలిచిపోవే కన్నులా.. ఊహలై...
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం
ఒక దేవతోత్సవ తోరణం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
సరిర్నిసా పమరిగా
సరిర్నిసా పమరిగా
దదపమ మదనిస నిదపమ మదనిస
సాస సాస ససరిరినినిసస
దాద దాద దదనినిపపదద
రిమాగ నిదప దనిద నిసనిద
పమాగ దసమ నిదప సనిదప
సస రిరి గగ మమ ప
సస నిని దద పప మ
నిరిగమప
సలలిత స్వరభోగమే
ఎద పలకరించే పుణ్యమే
ఉదయ గానం ప్రాణమై
నా హృదయ కమలం విరియునే
ఎగసె మది సంగీతమే
ఎదుట పడితే స్నేహమే
విరహమిటుపై సాగదే
ఇది వెండి వెన్నెల పరువమే..
అధరసుధలే మధురమే
జతకలిసి పదమై పూవులే.. పూవులే..ఏఏ..
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం
ఒక దేవతోత్సవ తోరణం
మ్మ్..మ్మ్మ్..మ్మ్మ్...మ్మ్మ్.
2 comments:
పేరుకి తగినట్టుగా నే రాగమాలికలో పాటలన్నిటికీ సుమధురమైన స్వరాకృతిని ప్రసాదించారు ఇశై ఙాని ఇళయరాజా..
థాంక్స్ శాంతి గారు.. నాక్కూడా ఈ సినిమాలోని పాటలన్నీ ఇష్టమండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.