ఆదివారం, ఏప్రిల్ 19, 2020

లాలిజో లాలిజో అని పాడను...

అమృతం సీరియల్ నిర్మించిన జస్ట్ యల్లో మీడియా నే నిర్మించిన మరో సీరియల్ నాన్న. అమృతం తర్వాత ఈ సీరియల్ కూడా కొంతకాలం ఫాలో అయ్యేవాడిని నేను. ఈ టైటిల్ సాంగ్ కూడా చాలా బావుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సీరియల్ చూడాలన్న ఆసక్తి ఉంటే ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : నాన్న (2004)
సంగీతం : కళ్యాణిమాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కళ్యాణిమాలిక్

లాలిజో లాలిజో
అని పాడను ఇకపైనా
మేలుకో మేలుకో
తెలవారే సమయానా
బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా

నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ....
అమ్మ చెప్పిందీ....


మరిచిపోతే నీ బాధా
తనే అనాధ అయిపోదా
నేస్తమే వదులుకో నిన్నతో

నడి ఎడారి ఇక మీదా
నవ వసంతమై పోగా
బంధమే కలుపుకో నవ్వుతో

బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా
నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ...
అమ్మ చెప్పిందీ... 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.