ఆదివారం, ఏప్రిల్ 12, 2020

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ...

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ వ్యాపిస్తున్న కరోనా జబ్బునూ పెరుగుతున్న మరణాలనూ ఇల్లు కదలకుండా చూస్తూండడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్తితిలో ఆ లయకారుడ్ని ఏం అడగాలన్నా ఇదిగో  సిరివెన్నెల రాసిన ఈ పాటే గుర్తొస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సిరివెన్నెల (1987)
సంగీతం : కే. వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : బాలు

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది 
 
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది 
 
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది 
 
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది 

2 comments:

ఈ పాటలో నింద లు చమత్కారంగా వ్రాశారు. బాగుంది. అయితే conclusion లో శివుడి గొప్పతనం గురించి వ్రాస్తే పాటకు నిండుదనం వచ్చేది అని నా అభిప్రాయం. పాటలో నింద తప్ప స్తుతి లేదు.

అయితే పాట బాణీ బాగుంది. మోహన , బిలహరి రాగాలు ఉపయోగించారు.

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ జి.కె.కె గారు.. ఈ పాటకు సిరివెన్నెల గారే చెప్పిన భాష్యం బావుంటుందండీ ఒక సారి వీలైతే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=aPFvjnrj-Zs

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.