దొంగ దొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట సినిమాటోగ్రఫీ ఆ లైటింగ్ ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది, దదాపు ముప్పై ఏళ్ళ క్రితం పి.సి.శ్రీరాం అండ్ మణిరత్నం కలిసి సృష్టించిన అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దొంగదొంగ (1993)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : మనో, ఉన్ని మీనన్, చిత్ర
ఓఓఓ..ఓఓ...
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
సద్దేమణిగిన రాతిరి యేళ
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే
నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి
వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి
మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి
ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి
మీ ఆశలన్నీ
అడిఆశలంట
ఈ ఏలం పాట
మీ ఊహల పంట
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
ఇద్దరు సూరీలొచ్చిరమ్మా
ఒంటరి తామర నలిగెనమ్మా
కత్తుల బోనే స్వయంవరమే
కలిగెను నాలో ఒక భయమే
దమయంతిని నేనమ్మా
నల మహారాజు ఎవరమ్మా
మనసైన వాణ్ణి నేనమ్మా
మహరాజును నేనే చిలకమ్మా
ఇది పరవశం నాకు
నా తనువున ఒణుకు
వెలువడదే పలుకు
తను ఎవరికి సొంతమో చెప్పాలంటే
ఏం చెబుతుంది మూగప్రాయం
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంట
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి
గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
అందెల సడి నా మనసే దోసింది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.