బుధవారం, ఏప్రిల్ 22, 2020

కొలువై ఉన్నాడే...

స్వర్ణకమలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. జతులు ఆడియోలో చివరన వీడియోలో పాట మొదట ఉన్నాయి గమనించగలరు.


చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల

తైతా కిటతక తతిహితతోం
తాతా కిటతక తతిహితతోం
తయ్యత్తోం తతిహితతోం
తతిహి తతిహి తాం
తతహిత తదిగిణ తద్ధిం
ధనతధిమి తై ధనతఝణు తాం
ఝణుతధిమి తాం ధిమితకిట 
తాం ధణతధిమి తాం ధణతఝణు
తై ఝణుతధిమి తై ధిమిటకిత
తాం ఝణుతధిమిత
తై ఝణుతధిమిత
తధిం ధనతఝణుత

కంఠేనాలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవదేవుడూ
కొలువై ఉన్నాడే దేవదేవుడూ
కొలువై ఉన్నాడే...
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
కొలువై ఉన్నాడే...

పలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచుల వంక తనర
పలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచుల వంక తనర
పలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచుల వంక తనర
తలవంక నలవేలూ...ఊఊఊఊ..
ఆఆఆ...ఆఅ...ఆఆఆ...ఆఆఅ..ఆఆ..
తలవంక నలవేలు కులవంక నెలవంక
తలవంక నలవేలు కులవంక నెలవంక
వలచేత నొక జింక వైఖరి మీరంగ

కొలువై ఉన్నాడే దేవదేవుడూ
కొలువై ఉన్నాడే...

మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ
మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ
ఆఆఆ..ఆఆ..ఆఆఅ...ఆఆఅ..ఆఆఅ...ఆఆఆ..
పాలుగారు మోమున శ్రీలు పొడమ
పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి చెలగా

కొలువై ఉన్నాడే దేవదేవుడూ
దేవ దేవుడూ కొలువై ఉన్నాడే


2 comments:

మీ మంచి ఆభిరుచి మా లాంటి వారి దాహలనూ తీర్చేను. ధన్యులమయ్యాం.

థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కామెంట్ సుబ్బు గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.