గురువారం, ఏప్రిల్ 30, 2020

కనులలో నీ రూపం...

రావణుడే రాముడైతె చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..

నీ గీతి నేనై నా అనుభూతి నీవైతే చాలు
పదివేలు కోరుకోనింక ఏ నందనాలు
ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు
అంతే చాలు ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ హహాహా హో హో హో హో

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..

ఆ కొండపైనే ఆగే మబ్బు తానే
ఏమంది.. ఏమంటుంది?
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే
ఏమంది.. ఏమంటుంది?
పదికాలాలు ఉంటానంటుంది
హా ఆ ఆ ఆ ఆ హహాహా హ హ హ

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే..


3 comments:

A good song wherein mohana ragam and sivarajani are mixed in a pleasant way.

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అజ్ఞాత గారూ, బుచికి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.