హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : హ్యాపీ వెడ్డింగ్ (2018)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హేమచంద్ర, శ్రావణభార్గవి
ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది నిజమేనా
కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..
ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఏంవిన్నావో
ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా
ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా..
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
కోరే.. వరమేదో.. మునుముందే నిలుచుందే
ఇంకా.. కలలేనా.. కనుపాపా
చేరే దరియేదో.. రమ్మంటూ ఎదురైతే
చూస్తూ.. నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా.. ప్రాయం రాలేదా
అడుగేస్తే పడిపోతావా.. పడవే ముందడుగా
ముందూ వెనక చూడకా.. పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ.. తరిమే దుందుడుకా
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
నీలో.. నీతోనే.. దోబూచి దొంగాట
నీకే.. నువ్వు దొరికేదెపుడంటా
ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట
ఆలోచిద్దాం అందాక.. తప్పేం లేదంటా
కవ్వించే కయ్యాలతో.. నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది.. మనసుల ముద్దాటా
అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో
అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో
ఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..
ఓ.. ఎం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా.. ఓఓ..
ఏమో.. ఏమో.. ఏమన్నానో.. ఏమన్నావో
ఏమో.. ఏమో.. ఎం విన్నావో.. ఎం విన్నానో
ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఎం విన్నావో.. ఏమో
2 comments:
పాపం ఈ హీరో హీరోయిన్స్ ని యెంత ప్రయత్నించినా చేసినా చూడటం కష్టమే..
హీరో గారి గురించి మాట్లాడను కానీ నీహారిక మాత్రం టీవీ కెమెరా ముందు ఉన్నంత ఫ్రీగా మూవీ కెమెరా ముందు ఉండలేకపోతుంది అనిపిస్తుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.