మంగళవారం, ఆగస్టు 07, 2018

తొలి తొలి ఆశే ఏమందే...

లేటెస్ట్ హిట్ చి||ల||సౌ|| చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిలసౌ (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి    
సాహిత్యం : శ్రీ సాయి కిరణ్ 
గానం : చిన్మయి 

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా

అదేదో జరిగిందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా

మెల్లగా మెల్లగా
నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా

మెల్లగా మెల్లగా
ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా

ఏమయ్యిందో చినుకై
ఎదలో మొదలై ఒక అలజడి
పోపొమ్మంటూ ఇటు తరిమినదా
లోలో ఏదో ఇదివరకెపుడెరుగని
తలపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమీ

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా

మెల్లగా మెల్లగా
నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా

మెల్లగా మెల్లగా
ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

2 comments:

కళ్ళుమూసుకుని పాట వినడం బెస్టండి..హీరోయిన్ చక్కగా ఉన్నా..హీరో..

హహహహ ఈ హీరోగారు ఈ సిన్మాలోనే కాస్త భరింఛగలిగేలా ఉన్నాడు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.