బుధవారం, ఆగస్టు 08, 2018

అనగనగా / సఖియా

గూఢచారి చిత్రంలోని రెండు చక్కని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటల ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ అనగనగా వీడియో ఇక్కడ చూడవచ్చు. సఖియా లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గూఢచారి (2018)
సంగీతం : శ్రీచరణ్ పాకాల    
సాహిత్యం : రమేష్ యద్మ
గానం : అంబిక శశిట్టల్

అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా

అనగనగా ఓ మెరుపుకలా
కనబడుతున్నది కళ్ళకిలా
తడబడినా ఆ గుండె దడా
వినబడుతున్నది పైకి ఎలా
ఇదివరకు అసలెరుగనిదీ
అలజడి నీ పనా
తనవశమై అతి పరవశమై
మెరుపై ఉరమన
చినుకై చేరన
అలనై కదలన
వరదై పారనా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : గూఢచారి (2018)
సంగీతం : శ్రీచరణ్ పాకాల    
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ 
గానం : శ్రీచరణ్ పాకాల, యామిని ఘంటసాల

ఏదో ఏదో మన మధ్యలో
ఎన్నో ఎన్నో మన కళ్ళలో
నిలిచే కథలే ఈ ప్రేమలో
ప్రాణం గమ్యం అన్నీ
నువ్వై ఉన్నావే ప్రియా
చినుకై చినుకై నా మనసులో
పెరిగే వరదై నా గుండెలో
నువ్వే కాదా ఈ మాయలో
నన్నే ముంచీ తేల్చేశావే ఓ ప్రియా

తుఫానులా నన్నే చేరావే
నీ ప్రేమలో ప్రియా
హఠాత్తుగా నన్నే తాకావే
నీ నవ్వుతో ప్రియా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా

మనసులో నీ స్వరం నే విన్నాలే
అనుక్షణం ప్రేమలో నీతో ఉంటాలే
అందుకోని చందమామ నిన్ను తాకే అలా
అంతులేని సాగరాన్ని దాచి ఉంచా ఇలా

తుఫానులా నన్నే చేరావే
నీ ప్రేమలో ప్రియా
హఠాత్తుగా నన్నే తాకావే
నీ నవ్వుతో ప్రియా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా 


2 comments:

అడివిశేష్ మూవీస్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి

అవును శాంతి గారు థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.