బుధవారం, ఆగస్టు 29, 2018

మొదలౌదాం తొలిప్రేమగా...

శ్రీనివాస కళ్యాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : అనురాగ్ కులకర్ణి, సునీత

మొదలౌదాం తొలిప్రేమగా
అపుడో ఇపుడో ఎప్పుడైతేనేం కొత్తగా..

జతపడదాం ఒక జన్మగా
మనలో ఎవరెవరో మరపైపోయే కలయికగా..

ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
నీ ఎదలో స్థిరపడిపోయా..

ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా..

ఆకలుండదే నా నువ్వే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణమేస్తుంటే..

ఉండలేనులే నీ మాటే...ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే...చుట్టుపక్క లేకుంటే

ఓ... నేను నేను కానులే...నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా..కదిలిందే ప్రేమే

ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణమేస్తుంటే..

ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే

హే... నువ్వొచ్చి చేరగా
అదేంటో కానీ నాలో నాకు
కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైనా మాటకైనా
నాకు నేను గుర్తుకైనా రానుగా
మనకు లేనెలేవుగా కల నిజం రెండుగా

ప్రతి జ్ఞాపకం అవదా
అనగా అనగా కథగా

ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణమేస్తుంటే..

హో ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే

ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంగా దాచనే చెలీ
ఒక్క మాటలో రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని
చెప్పలేనులే మరీ..

ఇద్దరొక్కటన్నదీ ఈ ప్రేమ వారధీ
వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి..

ఆకలుండదే నానిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణమేస్తుంటే..

ఓ ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే


2 comments:

మంచి వెడ్డింగ్ కాసెట్ లాంటి సినిమానట..

హహహహ ఎవరు చెప్పారో కానీ చాలా కరెక్ట్ గా చెప్పారండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.