మంగళవారం, ఆగస్టు 14, 2018

గీతగోవిందం - అన్నిపాటలు...

రేపు ఆగస్ట్ పదిహేనున విడుదలవనున్న గీతగోవిందం చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని అన్ని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటల ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సిద్ శ్రీరామ్, బృందం

తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

 
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలేచాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే


గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే

 
తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం


ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభసా
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశ

నీ యెదుట నిలబడు చనువే వీసా
అందుకొని గగనపు కొనలే చూసా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే...
ఇకపై తిరణాల్లే

 
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువా
జరిగినదడగవా
నా కధని తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవా
చెలిమిగ మెలగవా

నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే

 
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే


తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం  



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : చిన్మయి

అక్షరం చదవకుండా
పుస్తకం పేరు పెట్టేసానా
అద్బుతం ఎదుటనున్నా
చూపు తిప్పేసానా

అంగుళం నడవకుండా
పయనమే చేదు పొమ్మన్నానా
అమృతం పక్కనున్నా
విషములా చూసానా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

 
రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యము లిఖించరా
మరి మన ఇరువురి జత గీత గోవిందంలా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...


ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా...
నాకే తెలియని నన్నే నేడు కలిసా...
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా...
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా...

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 

చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సిద్ శ్రీరామ్

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

దేవ దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
హారతిపళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా


సాంప్రదాయణీ శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణీ సర్వాణీ
సాంప్రదాయణీ శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణీ సర్వాణీ

ఎద చప్పుడుకదిరే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్నీ కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా
ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన
నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా

ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ
నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా


ఏకాంతాలన్నీ ఏకాంతం లేక
ఏకరువే పెట్టాయే ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక
కన్నీరొంటరాయే నిలువ నీడ లేక

ఎంతదృష్టం నాదేనంటూ
పగబట్టిందే నాపై జగమంతా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా
నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా
మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటున కుంకమ బొమ్మ
ఓ వెయ్యేళ్ళాయుష్షంటూ దీవించిందమ్మా

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : విజయ్ దేవరకొండ

అమెరిక గర్ల్ ఐనా
అత్తిలి గర్ల్ ఐనా
యూరోప్ గర్ల్ ఐనా
యానాం గర్ల్ ఐనా

అమెరిక గర్ల్ ఐనా
అత్తిలి గర్ల్ ఐనా
యూరోప్ గర్ల్ ఐనా
యానాం గర్ల్ ఐనా

చైనా కెన్య జార్జియ లిబియా ఆస్ట్రేలియా
పాకిస్తాన్ హిందుస్తాన్ ఉజ్బేకిస్తాన్
ఏ గర్ల్ ఐనా...ఆఆఅ....అ

వాట్ ద వాట్ ద లైఫూ..
అమ్మాయంటేనే టఫ్ఫూ
ఆళ్ళ తిక్కకు మనమే స్టఫ్ఫూ
దానికి నేనే ప్రూఫూ.. హేయ్..

వాట్ ద వాట్ ద లైఫూ..
అమ్మాయంటేనే టఫ్ఫూ
ఆళ్ళ తిక్కకు మనమే స్టఫ్ఫూ
దానికి నేనే ప్రూఫూ.. హేయ్..


అమ్మాయిలంతా ఏంజెల్స్ అంటూ
అప్పటి కవులే వర్ణించారే
ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే
పెన్నులు పక్కన పారేస్తారే

ఫేస్బుక్కుల్లో వాట్సాప్ లో
పీకల్లోతులో మునిగుంటారు
పక్కన మనమే ఏమైపోనీ
మాకేం పట్టదు పొమ్మంటారు

మొగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాసు
సో మైడియర్ సో మైడియర్ ఇన్నొసెంట్ బోయ్సూ..
డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెపరరీ డేసూ..
మగాడు మటాషూ... ఊఊఊఊ...
 
వాట్ ద వాట్ ద లైఫూ..
అమ్మాయంటేనే టఫ్ఫూ
ఆళ్ళ తిక్కకు మనమే స్టఫ్ఫూ
దానికి నేనే ప్రూఫూ.. ||4||


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : సాగర్
గానం : గోపీ సుందర్

కనురెప్పల కాలంలోనే
కధ మొత్తం మారే పోయిందే
కనుతెరిచి చూసేలోగా
దరిచేరని దూరం మిగిలిందే

ఇన్నాళ్ళూ ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో
మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినదీ వింతేనా మన పయనం ఇంతేనా

కనురెప్పల కాలంలోనే
కధ మొత్తం మారే పోయిందే


కవి ఎవరో ఈ కథకి
ఎవరెవరో పాత్రలకి
తెలియదుగా ఇప్పటికీ
పొడుపు కథే ఎప్పటికీ

మనమంటు అనుకున్నా
ఒంటరిగానే మిగిలున్నా
ఇందరిలో కలిసున్నా
వెలితిని నేను చూస్తున్నా

పొరపాటు ఏదో తొరబాటు ఏదో
అది దాటలేని తడబాటు ఏదో
ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా
 
 
 

2 comments:

మోస్ట్ బ్యూటిఫుల్ యెండ్ లవ్లీ కపుల్ ఆన్ స్క్రీన్..ఇట్స్ లైక్ యే ఐ ఫీస్ట్ టు వాచ్ దెం బోత్..

అవును శాంతి గారు.. సినిమాకి కూడా మంచి హిట్ టాక్ వచ్చింది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.