శుక్రవారం, ఆగస్టు 24, 2018

కళ్యాణం వైభోగం...

వరలక్ష్మీవ్రతం సంధర్బంగా మహిళలందరకూ సకల సౌభాగ్యాలూ సొంతమవాలని కోరుకుంటూ శ్రీనివాస కళ్యాణం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : శ్రీమణి  
గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బృందం  

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం
కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామచంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య లీలామృతం
గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది
గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లొ పద్మావతమ్మ
పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విరి వలపు ప్రణాయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కళలొలికినాడమ్మా
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచభూతాలు
కొలువైన మండపాన
వరుడంటూ వధువంటూ
ఆబ్రహ్మ ముడి వేసి
జతకలుపు తంతే ఇదీ
స్త్రీ పురుష సంసార సాగరపు
మధనాన్ని సాగించమంటున్నదీ

జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు
సార్థక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం

 

3 comments:

మీకూ..మీ కుటుంబానికి శ్రావణ లక్ష్మి ఆశీస్సులు సంపూర్ణం గా కలగాలని ఆకాంక్ష..

జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు
సార్థక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా ......

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.