శైలజారెడ్డి అల్లుడు సినిమాలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం : గోపీసుందర్
సాహిత్యం : శ్యాం కాసర్ల
గానం : సత్యవతి (మంగ్లీ)
ఛమ్ ఛమ్ బల్ బరి జాతరే చూడే
బమ్‌చిక్ బమ్ బలిపోతాయ్యాడే
ప్రేమా పంతం నడుమన వీడే నలిగిపోతుండే
ఈ పోరడు హల్వా అయితుండే
తిప్పలు మస్తుగా బడ్డా
కొప్పులు రెండు కలువవు బిడ్డా
ఇంతటి కష్టం పడక
ఢిల్లీకి రాజవ్వచ్చుర కొడక
శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్
శాసనమే తన మాట
నీ అత్త శివగామి బయట
పంతం కూతురు ఎదుట
టామ్ అండ్ జెర్రీ ఆట
అమ్మకు అచ్చు జిరాక్సు
ఈ బొమ్మకు పిచ్చి పీక్సు
బద్దలు కానీ బాక్సు
వద్దనే మాటకు ఫిక్సు
అత్తను చూస్తే నిప్పుల కుండ
కూతురు చూస్తే కత్తుల దండ
ఈ ఇద్దరూ సల్లగుండ
పచ్చటి గడ్డి భగ్గున మండ
పట్టిన పట్టు వద్దనకుండ
ఏ ఒక్కరు తగ్గకుండ
బాబు నీ నెత్తిమీదేస్తే బండ
పడ్డవురా నువ్వు లేవకుండ
అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే
శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్
ఆ రైలు పట్టాలోలే
పక్కన్నే ఉంటారు వీళ్లే యే యే
మెళ్లోనే వేస్తారు నగలే యే యే
ఒళ్లంత చూస్తే ఇగోలే
కలిసుందాం రా సినిమా ఆ ఆ
కలిసే చూస్తారమ్మ
అటు ఇటు అచ్చు బొమ్మా ఆ ఆ
ఎన్నడు కలవవులేమ్మ
కట్టిన బట్ట పెట్టిన బొట్టు దగ్గర ఉండి
ఎక్కే బండి అన్నింట్ల అమ్మ సెలక్షన్
కడుపున పుట్టి అట్టకు మట్టి
పెరిగిన కుట్టి మాటలబట్టి
కట్టయ్యె ఉన్న కనెక్షన్
బాబు మట్టయ్యిపోయే ఎఫెక్షన్
నువ్వు తట్టుకోరా ఎమోషన్
అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే
శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్
2 comments:
బట్ ఫర్ రమ్యకృష్ణ..చూడటం కష్టమే..
మారుతి కొన్ని సినిమాలు బానే తీస్తున్నాడండీ చూడాలి మరి ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.