శనివారం, ఆగస్టు 18, 2018

రావా ఇలా...

పరిచయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పరిచయం (2018)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : వనమాలి 
గానం : అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా 

ఓ ప్రియతమా నా ప్రాణమా
వరములాగా వలపులాగా
నీ నవ్వే నలువైపులా
ఓ ప్రియతమా నా ప్రాణమా
వరములాగా వలపులాగా
నీ నవ్వే నలువైపులా
ఒకరికొకరు ఒదిగి ఒదిగి
కలల జతలో కరిగి కరిగి
ఎన్నెన్నో అల్లర్లు
ఏవేవో తొందర్లు
నాలోనా చిందేస్తూ
నీ వైపే తోస్తుందే

రావా ఇలా
మళ్ళీ రావా ఇలా 
రావా రావా నాతో ఇలా

నా లోకమంటే నా నువ్వు కాదా
నీతొనే నిండింది నా ఊపిరంతా
నీ సొంతమేగా నా కున్నదంతా
కరిగే నా కాలం నీ పాదాల చెంత
ఆకాశ వీధుల్లో ఆ నీలి మేఘాల్లో
దాగున్న లోకాన్ని చేరనీ
ఏకాంత సీమల్లో
ఎన్నెన్నో రంగుల్లో
అందాలే చూడనీ

రావా ఇలా
మళ్ళీ రావా ఇలా 
రావా రావా నాతో ఇలా

నీవల్లనేగా నా జీవితానా
వరమల్లే పొందాను ఓ కొత్త జన్మ
నీ స్నేహమేలే పంచింది నాకూ
ఈ నాడు చూడాలి నీ నిండు ప్రేమా
నీడల్లే నువ్వొచ్చి నీలోనా నన్నుంచి
ఓదారి చూపింది నీవేగా
నూరేళ్ళు నా వెంటే
జంటల్లే నువ్వుంటే
నాకంతే చాలుగా

రావా ఇలా
మళ్ళీ రావా ఇలా 
రావా రావా నాతో ఇలా

రావా ఇలా
మళ్ళీ రావా ఇలా 
రావా రావా నాతో ఇలా

2 comments:

బ్యూటిఫుల్ సాంగ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.