ఆదివారం, నవంబర్ 08, 2015

మనసే జతగా పాడిందిలే..

సత్యం గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఆ ఆ


మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఓ...

ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
హే హే.. ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
ఓ అందుకే ఓ చెలీ..అందుకో కౌగిలీ..ఓ చెలీ..హే..హే..

మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..


నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓహో.. నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓ అందుకే ఓ ప్రియా..అందుకో పయ్యెదా.. ఓ ప్రియా...

హే హే.. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే
తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..  
ఈ వేళలో ఎందుకో..
ఈ వేళలో ఎందుకో..

2 comments:

ఇంత చక్కటి ట్యూన్ కి మరి ఆడకుండా యెలా ఉంటుందీ..

హహహ అంతే కదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.