శుక్రవారం, నవంబర్ 06, 2015

రేగుముల్లోలే నాటు సిన్నాది...

చందమామ సినిమాలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : కార్తీక్, నోయెల్, ఎం.ఎం.శ్రీలేఖ

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఆఁహాఁ
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

Come on Come on Come on Baby
Shake your body baby
Come on Come on Come on Baby
Make me rock
Come on Come on Come on Baby
Save the song baby
Come on Come on Come on Baby
Make you rock

కోనేటి నీళ్ళల్లో ఆ ఆ వంగిందిరో ఆ ఆ
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో
గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా!
తన జడను విసిరి వయ్యారి ఆఁహాఁ
చిరు నగవు చిలికి ఒకసారి అబ్బో!
కొస పెదవి కొరికి ప్రతిసారి యహ

యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో
ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక

మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ
ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో
కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది

2 comments:

యెంతవారు కానీ..వేదాంతులైన కానీ..

హహహ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.