బుధవారం, నవంబర్ 11, 2015

ఆడే పాడే పసివాడా...

మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా పెళ్ళి కానుక చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజ
సాహిత్యం : చెరువు ఆంజనేయశాస్త్రి
గానం : సుశీల

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
నా మదిలో నీకు నెలవే కలదూ
నా మదిలో నీకు నెలవే కలదూ
బదులే నాకూ నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు
నిజమైన చాలునురా... ఆ.. ఆ..
నిజమైన చాలునురా

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...

చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
నీ రూపమే ఇంటి దీపము బాబూ
నీ రూపమే ఇంటి దీపము బాబూ
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన
మరివేరే కోరమురా... ఆ.. ఆ..
మరివేరే కోరమురా

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...
2 comments:

మీకూ మీ కుటుంబానికీ అష్టలక్ష్మీ కటాక్ష ప్రాప్తి రస్తు..శుభాకాంక్షలు..

ధన్యవాదాలు శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.