మంగళవారం, నవంబర్ 24, 2015

ఈ రోజుల్లో పడుచువారు..

ఈ రోజుల్లో.. అంటూ ఆ రోజుల్లో పాడినా ఈ రోజులకీ వర్తించే ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, కోరస్

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో.. ఓ ఓ ఓ ...

తాజా తాజా మోజుల కోసం తహతహలాడుతు ఉంటారు
తాజా తాజా మోజుల కోసం తహతహలాడుతు ఉంటారు
పొట్టి షర్ట్లతో టైటు ప్యాంట్లతో లొట్టి పిట్టలవుతుంటారు
మెప్పులు కోసం.. అప్పులు చేసి
మెప్పులు కోసం అప్పులు చేసి తిప్పలపాలవుతుంటారు

ఈరోజుల్లో.. ఓ ఓ ఓ ...

రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీటేస్తారు
రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీటేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్నది కాస్తా.. చెయ్యి విసిరితే
ఆ చిన్నది కాస్త చెయ్యి విసిరితే చెప్పకుండా చెక్కేస్తారు

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో.. ఓ ఓ ఓ .....

పాఠాలకు ఎగనామం పెట్టి మ్యాటిని షోలకు తయ్యారు
పాఠాలకు ఎగనామం పెట్టి మ్యాటిని షోలకు తయ్యారు
పార్టీలంటూ పికినికులంటూ పుణ్యకాలము గడిపేరు
పరీక్ష రోజులు.. ముంచుకురాగా
పరీక్ష రోజులు ముంచుకురాగా 
తిరుపతి ముడుపులు కడతారు

ఈరోజుల్లో ... పడుచువారు గడుసువారు
సహనంలో కిసానులు సమరంలో జవానులు
ఈరోజుల్లో.. ఓ ఓ ....

ఆడపిల్లలను గౌరవించితే ఆత్మ గౌరవం పెరిగేను
సమరసభావం కలిగిన నాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళ కోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని మరవద్దు
ఆ భారం మనదని మరవద్దు... మనదని మరవొద్దు0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.