సోమవారం, నవంబర్ 09, 2015

ఈ చల్లని లోగిలిలో...

మిత్రులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు.. ఈ సంధర్బంగా ఆ లక్ష్మీదేవి మన యింట కొలువుండాలని కోరుకునే ఈ పాట తలచుకుందాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో

పిల్లల పాపల అల్లరితో 
ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో 
ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా
పసుపు కుంకుమ కొల్లలుగా
ఈ పచ్చని ముంగిట కురవాలి

ఈ చల్లని లోగిలిలో

శుభముల నొసగే ఈ మందిరము
శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము
శాంతికి నిలయం కావాలి
లక్ష్మి సరస్వతి పొందికగా
ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి

ఈ చల్లని లోగిలిలో

ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా
ప్రతి రోజూ ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా
ప్రతి రోజూ ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో
వచ్చే పోయే అతిధులతో
మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి

ఈ చల్లని లోగిలిలో
ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి
అనురాగం పండాలి
అనురాగం పండాలి

2 comments:

ధన త్రయోదశి శుభాకాంక్షలు వేణూజీ..

ధన్యవాదాలు శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.