గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ సినిమాలో పాటలు ఎప్పుడు విన్నా ఘంటసాల గారు ఇంకా కొన్ని సినిమాలకి సంగీతం ఇచ్చి ఉంటే బావుండేదేమో అనిపిస్తుంటుంది. ఇక ఈ పాటైతే మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ వినగానే మనసులో ఒక మధురభావన వచ్చేస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని
ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ
వలపు పాశమని బెదరితిలే
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
వేణుగానమును వింటిలే
కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని
ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ
వలపు పాశమని బెదరితిలే
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
2 comments:
గుండమ్మ కథ చిత్రంలో అన్ని పాటలు అణిముత్యాలు. Golden Classic songs.సినిమా లో అన్నిపాటలు సూపర్ హిట్స్ చేయడం ఒక్క ఘంటసాల గారికే సాధ్యం అని ఇళయరాజా చెప్పినట్లు ఒక వ్యాసంలో చదివాను. ఆ మాట నిండు నిజం. పాతాళ భైరవి, మాయ బజార్, లవకుశ చిత్రాలు దీనికి నిదర్శనం.
అవునండీ ఘంటసాల గారి ఖాతాలో చాలా చిరస్మరణీయమైన మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.