గురువారం, మే 07, 2020

కలికి చిలకల కొలికి...

సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వేటూరి గారి అచ్చతెలుగు సాహిత్యం అద్భుతమీ పాటలో.


చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి

మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి
ఆ మాట యీ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటిపాపనూ మన్నించి పంపూ

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేత రామా

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి2 comments:


కరోనా వారిని పడని ఏకైక బ్లాగు మీదేనండోయ్ :)జిలేబి

హహహ జిలేబి గారు తిట్టారో పొగిడారో అర్ధంగాకుండా ఉంది :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.