నిన్నటి విషాద గీతం కాస్త హెవీ అయింది కదా అందుకే ఈ రోజు ఈ హాస్య గీతంతో మనసు కాస్త తేలిక పరచుకుందాం. పిట్టలదొర సినిమాలోని ఈ పాటన్నా ఆపకుండా మాట్లాడే వాళ్ళ మాటతీరన్నా నాకు భలే ఇష్టం. ఆలీ గారు ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఈ పాట లిరిక్స్ కూడా బావుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు.
చిత్రం : పిట్టలదొర (1996)
సంగీతం : రమణి భరధ్వాజ్
సాహిత్యం :
గానం : మనో
తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.. బుర్ర్ బుర్ర్.. హహ
వచ్చె వచ్చె వచ్చె
బగ్గొచ్చె బగ్గొచ్చె ఎవడొచ్చె
ఎంకట్రాముడొచ్చె మా రాజా యిహిహా..
ఎయ్ తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
ఒరె ఒరె తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
పూట పూటకు చాటెడు గింజలకు
యాడేడ దిరిగే బాట సారినీ నేనే..
హయ్ మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆఅ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
తారె తందనానా దిమిదిమి
రాజా వందనానా
తానె తందనానా దిమిదిమి
రాజా వందనానా
మారాజ మారాజ నా తుపాకంటే ఏమనుకున్నరు
ఓ సారి అమీన్ సాబు తుపాకీ నా తుపాకీ
పోటీబెట్టుకుని హుస్సేన్ సాగర్ లొ పారేత్తే
అమీన్ సాబు తుపాకీ అడుగుబట్టింది
నా తుపాకీ మునుగుతూ తేలుతూ
మునుగుతూ తేలుతూ తూము కాడ తేలింది
గంత నెంబర్ వన్ తుపాకి మారాజా..
గీ తుపాకి కోసం పాకిత్తాన్ ప్రధానమంత్రి
పదిలచ్చలిత్తానని పది సార్లు ఇమానమేస్కుని
నా యింటికొచ్చిండు.. నేనిచ్చిన్నా..
హిహి ఇయ్యలే మారాజా
ఇక నేను పుట్టింది దేవరకొండ
పెరిగింది నల్గొండ ఉండేది గోల్కొండ
అడక్కదినేది హన్మకొండ మారాజా.. హిహిహా..
హే.. అరవై ఎకరాల్ అంగూర్ తోటా
హైదరబాదుల ఉన్నది
ముప్పై ఎకరాల్ చెరుకు తోటా
సికిందరబాదుల ఉన్నదీ
అరవై ఎకరాల్ అంగూర్ తోటా
హైదరబాదుల ఉన్నది
ముప్పై ఎకరాల్ చెరుకు తోటా
సికిందరబాదుల ఉన్నదీ
మోటర్లున్నయ్ ఎన్నో
స్టార్ హోటళ్ళున్నయ్ ఎన్నో
స్కూటర్లున్నయ్ ఎన్నో
గాలి మోటర్లున్నయ్ ఎన్నో
మారుతి కంపెని వాటా నేనే
టాటా బిర్లాకు పోటీలే..
హయ్ మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆఅ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
మారాజ మారాజా నా ఆస్థి పాస్తులను జూసి
నాకు పిల్లనిస్తమని ఎంతమందొచ్చిన్రో ఎరుకా
యాక్టర్లొచ్చిరి డాక్టర్లొచ్చిరి డైరెక్టర్లొచ్చిరి కలెక్టర్లొచ్చిరి
కాంట్రాక్టర్లొచ్చిరి కండక్టర్లొచ్చిరి మారాజా
ఇంక జెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు
సూరత్ నుండి సుల్తాన్లు దుబాయ్ నుండి నవాబ్లు
మస్కట్ నుండి మంత్రులు
అమెరికా నుండి ఎందరో వచ్చిన్రు
ఇందరొచ్చినా నాకెవ్వరూ నచ్చలేదు మారాజా
ఇంక నా అందచందాలు జెప్పాలంటే మారాజా
ఆంధ్రావనికే అందగాడినీ
ఎందరొ నచ్చిన సుందరాంగుని
అందరు మెచ్చిన బాయి ఫ్రెండుని
ఆసియ లోనే జేమ్సు బాండుని
ఒరెఒరె ఆంధ్రావనికే అందగాడినీ
ఎందరొ నచ్చిన సుందరాంగుని
అందరు మెచ్చిన బాయి ఫ్రెండుని
ఆసియ లోనే జేమ్సు బాండుని
వరల్డు లోనా నేనే వండరు బోయిని నేనే
హాస్యం లోనా నేనే ఆల్ రౌండరు నేనే
అందంలోనా పందెం వేస్తే
ఇంద్రుడు చంద్రుడు నేనేలే
మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
పూట పూటకు చాటెడు గింజలకు
యాడేడ దిరిగే బాట సారినీ నేనే..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఒరెఒరె.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
సంగీతం : రమణి భరధ్వాజ్
సాహిత్యం :
గానం : మనో
తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.. బుర్ర్ బుర్ర్.. హహ
వచ్చె వచ్చె వచ్చె
బగ్గొచ్చె బగ్గొచ్చె ఎవడొచ్చె
ఎంకట్రాముడొచ్చె మా రాజా యిహిహా..
ఎయ్ తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
ఒరె ఒరె తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
పూట పూటకు చాటెడు గింజలకు
యాడేడ దిరిగే బాట సారినీ నేనే..
హయ్ మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆఅ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
తారె తందనానా దిమిదిమి
రాజా వందనానా
తానె తందనానా దిమిదిమి
రాజా వందనానా
మారాజ మారాజ నా తుపాకంటే ఏమనుకున్నరు
ఓ సారి అమీన్ సాబు తుపాకీ నా తుపాకీ
పోటీబెట్టుకుని హుస్సేన్ సాగర్ లొ పారేత్తే
అమీన్ సాబు తుపాకీ అడుగుబట్టింది
నా తుపాకీ మునుగుతూ తేలుతూ
మునుగుతూ తేలుతూ తూము కాడ తేలింది
గంత నెంబర్ వన్ తుపాకి మారాజా..
గీ తుపాకి కోసం పాకిత్తాన్ ప్రధానమంత్రి
పదిలచ్చలిత్తానని పది సార్లు ఇమానమేస్కుని
నా యింటికొచ్చిండు.. నేనిచ్చిన్నా..
హిహి ఇయ్యలే మారాజా
ఇక నేను పుట్టింది దేవరకొండ
పెరిగింది నల్గొండ ఉండేది గోల్కొండ
అడక్కదినేది హన్మకొండ మారాజా.. హిహిహా..
హే.. అరవై ఎకరాల్ అంగూర్ తోటా
హైదరబాదుల ఉన్నది
ముప్పై ఎకరాల్ చెరుకు తోటా
సికిందరబాదుల ఉన్నదీ
అరవై ఎకరాల్ అంగూర్ తోటా
హైదరబాదుల ఉన్నది
ముప్పై ఎకరాల్ చెరుకు తోటా
సికిందరబాదుల ఉన్నదీ
మోటర్లున్నయ్ ఎన్నో
స్టార్ హోటళ్ళున్నయ్ ఎన్నో
స్కూటర్లున్నయ్ ఎన్నో
గాలి మోటర్లున్నయ్ ఎన్నో
మారుతి కంపెని వాటా నేనే
టాటా బిర్లాకు పోటీలే..
హయ్ మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆఅ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
మారాజ మారాజా నా ఆస్థి పాస్తులను జూసి
నాకు పిల్లనిస్తమని ఎంతమందొచ్చిన్రో ఎరుకా
యాక్టర్లొచ్చిరి డాక్టర్లొచ్చిరి డైరెక్టర్లొచ్చిరి కలెక్టర్లొచ్చిరి
కాంట్రాక్టర్లొచ్చిరి కండక్టర్లొచ్చిరి మారాజా
ఇంక జెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు
సూరత్ నుండి సుల్తాన్లు దుబాయ్ నుండి నవాబ్లు
మస్కట్ నుండి మంత్రులు
అమెరికా నుండి ఎందరో వచ్చిన్రు
ఇందరొచ్చినా నాకెవ్వరూ నచ్చలేదు మారాజా
ఇంక నా అందచందాలు జెప్పాలంటే మారాజా
ఆంధ్రావనికే అందగాడినీ
ఎందరొ నచ్చిన సుందరాంగుని
అందరు మెచ్చిన బాయి ఫ్రెండుని
ఆసియ లోనే జేమ్సు బాండుని
ఒరెఒరె ఆంధ్రావనికే అందగాడినీ
ఎందరొ నచ్చిన సుందరాంగుని
అందరు మెచ్చిన బాయి ఫ్రెండుని
ఆసియ లోనే జేమ్సు బాండుని
వరల్డు లోనా నేనే వండరు బోయిని నేనే
హాస్యం లోనా నేనే ఆల్ రౌండరు నేనే
అందంలోనా పందెం వేస్తే
ఇంద్రుడు చంద్రుడు నేనేలే
మాటలకేమో కుబేరుని..
కూటికి లేని కుచేలుని..
మాటలకేమో నవాబుని..
పూటకు లేని గరీబుని..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఆ.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
తూటలు లేని తుపాకి బట్టి
మాటలతోనే కోటలు గట్టి
పూట పూటకు చాటెడు గింజలకు
యాడేడ దిరిగే బాట సారినీ నేనే..
నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
ఒరెఒరె.. నేనే ఎంకట్రాముడ్ని..
నేనే పిట్టల దొరనీ..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
అవ్వా ఒక పైసెయ్యి..
అయ్యా జర గాసంబొయ్యి..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.