శుక్రవారం, మే 22, 2020

ఉడతా ఉడతా ఊచ్చి..

మాయలోడు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి    
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

ఎత్తా అవతారం
ముగిస్తా ముదిరిన వ్యవహారం
ఇది మీ పోగాలం
ఇయాలతో పోదా భూభారం

ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి
కొరడా పడితే గురుడా అనరా తలొంచీ..
ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...

ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి


నాతోనా ఛాలెంజి.. వాతెయ్ నా కీలెంచి
బుడతా ఎందుకు చెడతవురా
చెబితే వినవే కీడెంచి రేయ్..
అరె తెలివంతా చూపించి
టక్కుటమారం జరిపించి
మిడిసి పడకురా మిడతం భొట్లు
మిడి మిడి విద్యలు మితిమించి
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
ఘల్ ఘల్ గజ్జలు కట్టాలా
ఛం ఛనక్ చిందులు కొట్టాలా
ఛంగ్ చక ఛంగ్ చక్ చంగ్ చక ఛా
ఛమక్ ఛమక్ చుక్కలు చిక్కాలా
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అమ్మమ్మమ్మా..
ముల్లోకాలేకం చేసే మైకం
రంభ కొంపకెగిరెళ్ళాలా
యమ సంబరంగ డాన్సింగులు
సాంగులు చెయ్యాలా
దిట్టంగా దరువెయ్యంగా
శృతి తప్పించీ..
అయ్యో అయ్యో అయ్యయ్యో

ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి రేయ్..


నానా గడ్డీ నమిలేసీ ఏం బలిసావుర ఏబ్రాసీ
పోలేరమ్మకి పలారమెడతా అడ్డంగా నిను తెగ్గోసీ
రేయ్ నీ చిట్టా తిరగేసీ చక్రవడ్డీల్లెక్కేసీ
చీటీ చించేస్తారో కుంకా నూకలు మొత్తం చెల్లేసీ
ఓయబ్బో ఏందబ్బో అబ్బా అబ్బను చూశానయ్యబ్బో
చమురింకేలా చిమచిమలాడీ శివాలెత్తెరో శివశంబో
దెబ్బకు దెయ్యం దిగొచ్చెనయ్యో అశ్శరబశ్శరబ
వామ్మో వామ్మో పిండం పెట్టకు దండం పెడతా బాబూజీ

ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
ఉడతా ఉడతా ఊచ్చి.. ఎక్కడికెడతావోచ్చి...
పెడతా పెడతా అప్పచ్చి ఎనకాముందు బిగించి
జగదేక వీరాయ్ సుకుమార సూరాయ్
టక్కుటమార గజకర్న గోకర్న బాకర్న జాకర్న
భజగోవింద ఢాం...

 

2 comments:

నాకు బాగా నచ్చిన పాట ఇది వేణు గారు.

Super lyrics acting music and extraordinary singing by Balu Garu.

చివర్లో ఇచ్చిన ఉడుత gif భలే ఉంది. Thank you.

థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ బుచికి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.