ఆదివారం, మే 03, 2020

ఆకాశంలో ఆశల హరివిల్లూ...

స్వర్ణకమలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : జానకి

ఆ..... ఆ.... ఆ..... ఆ.....
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికెయ్నా
పిల్లగాలే పల్లకీగా
దిక్కులన్నీ చుట్టిరానా
నాకోసం నవరాగాలే
నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన
చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే
వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ

2 comments:

ఈ పాట ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఉత్సాహం, ఆనందం కలుగుతుంది నా మనసుకి సిరివెన్నెల గారి అద్బుతమైన సాహిత్యం ప్రతి పదంలో లోతైన అర్థం ఇళయరాజా గారి సంగీతం ఇంకా చివరిగా మన జానకమ్మ గారి గొంతు మనల్ని పరవశింప చేస్తుంది ఎప్పటికీ వన్నె తరగని పాట

అవునండీ పాట గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.