శుక్రవారం, మే 08, 2020

హైర హైర హైరబ్బా...

జీన్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీన్స్ (1999)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్ 
సాహిత్యం : శివగణేష్, ఏ.ఎం.రత్నం
గానం : ఉన్నికృష్ణన్, పల్లవి

నాకే నాకా... నాకే నాకా...
నువు నాకే నాకా... ఆ...ఊఁ...
మధుమిత మధుమిత మధుమిత...

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలొ నిను తడిపేనా
కురుల తోటే తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వమా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎరట్రి తివాచీ పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్‌కూ సమాధి
నిద్దర చెడగొడదాం

నీలాకాశమే దాటి ఎగరకూ
ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు
ఆయాసమో ఆవేశమో
 
పైర గాలికి వయసాయే
నేల తల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ
ప్రేమకు మాత్రం వయసైపోదు

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

చెర్రీ పూలను దోచేగాలి
చెవిలో చెప్పెను ఐలవ్‌యూ
సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి
నాతో అన్నది ఐలవ్‌యూ
నీ ప్రేమనే నువు తెలుపగ
గాలులూ పక్షులూ
ప్రేమ పత్రమై కుమిలినవో


ఒంటి కాలితో పూవే నిలిచెను
నీ కురులలో నిలిచేందుకే
పూబాల ఓ పూవెట్టనా
చిందే చినుకులు నేల వాలెను
నీ బుగ్గలే ముద్దాడ గా
నేనూ నిన్నూ ముద్దాడనా
 
హృదయ స్పందన నిలిచిననూ
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్నూ నువ్వీడితే
మరుక్షణముండదు నాప్రాణం


హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నీకే నీకు


నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా

పట్టు పూవా పుట్ట తేనే
నీ నడుం సగం తాకనివ్వమా
హైర హైర హైరబ్బా...
హైర హైర హైరబ్బా...

 

8 comments:

ఈ పాటలో ఆణిముత్యాలు చదివి హాయిగా నవ్వుకోవచ్చు.

ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత

ఒంటె కాలితో పూవే నిలిచెను

పెదవిపైనే పవళించేనా

నీ నడుం సగం తాకనివ్వమా

డబ్బింగ్ పాటల అంటేనే కామెడీ లిరిక్స్.

అన్నట్లు అది ఒంటె కాలితో కాదండోయ్ ఒంటి కాలితో నేను సరి చేయడం మర్చిపోయాను. ఇట్స్ లైక్ పిక్ మీ అని అడుగుతున్నట్లనమాట :-) నాకు ఆ స్త్రీ కవిత తప్ప మిగిలిన వాటి గురించి ఆక్షేపణ లేదు. అన్నట్లు మీకు సైప్రస్ చెట్లు దావూద్ పక్షి గురించి తెలుసా ;-)

వేణూశ్రీకాంత్ గారు,
మీరు మీ పాఠకుల మీద దయుంచి ఈ డబ్డ్ పాటలు ..... పాటలా అవి కావు, నవ హింసమార్గాలు ..... ఇక్కడ వెయ్యకుండా ఉండగలిగితే శతధా కృతజ్ఞులుగా ఉంటామని మనవి 😁😁😁.

హహహహహహ నరసింహా రావు గారూ జీన్స్ లోదే అతిశయం పాట స్కెడ్యూల్ చేశానండీ అది వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేస్తాలెండి. ఇక మిగిలినవి సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తాను :-)

అమ్మయ్య, Thanks వేణుశ్రీకాంత్ గారు.
బుచికి గారికేమన్నా తెలుసేమో తెలియదు గానీ పైపాటలోని // “ సైప్రస్ చెట్లు దావూద్ పక్షి” // గురించి నాకయితే తెలియదు. ఈ ఒక్కసారికి మాత్రం ఈ డబ్బింగ్ ఆణిముత్యం గురించి వివరించి పుణ్యం కట్టుకోండి. 🙂

వాటి గురించి నాకూ తెలీదండీ.. సైప్రస్ చెట్లు కొన్ని ప్రాంతాల్లో క్రిస్టమస్ ట్రీగా వాడతారని మాత్రమే తెలుసు. బుచికి గారు ఆ లైన్ గురించి మాట్లాడకపోతే బహుశా వారికేమైనా తెలుసేమో అని అడిగాను నేను కూడా :-)

సైప్రస్ చెట్లు దావూద్ పక్షి - ఇది పరిశోధించవలసిన విషయమే. పాట లిరిక్స్ కామెడీ గా ఉన్నా పాట చిత్రీకరణ సంగీతం డాన్స్ అన్నీ శంకర్ స్థాయి లో బాగున్నాయి వేణు గారు.

అప్పుడప్పుడు డబ్బింగ్ పాటలు కూడా ఇవ్వండి. మనసారా నవ్వుకోవచ్చు.

అవునండీ విజువల్ గా బావుంటాయ్ ఈ పాటలు దానికి తోడు లిరిక్ వినపడనివ్వకుండా రెహమానుడి మ్యూజిక్ ఎలానూ ఉండనే ఉంది :-) లిరికల్ గా కూడా దీని తార్వాత వచ్చిన బోయ్స్, రోబో, ఐ వీటి మీద జీన్స్ కాస్త బెటరే అనిపిస్తుందండీ.. అవి మరీ ఘోరం..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.