ఆశఆశఆశ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఆశఆశఆశ (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సుర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది
ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
చిట్ చిట్ చిట్ చిట్ చిటి పొటి పిచికా
చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక
పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని
ఆడుకుందాం రమ్మన్నాయి తలలూచి
కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి
పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా.. అమ్మమ్మా..
మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ళే ఉడత
మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
ఝల్ ఝల్ ఝల్ ఝల్ పారే ఏరా
ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో
నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో
ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా.. అమ్మమ్మా..
మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది
ఇల నేలుతున్నది
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సుర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది
ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
చిట్ చిట్ చిట్ చిట్ చిటి పొటి పిచికా
చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక
పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని
ఆడుకుందాం రమ్మన్నాయి తలలూచి
కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి
పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా.. అమ్మమ్మా..
మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ళే ఉడత
మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
ఝల్ ఝల్ ఝల్ ఝల్ పారే ఏరా
ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో
నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో
ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా.. అమ్మమ్మా..
మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి
మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది
ఇల నేలుతున్నది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.