మంగళవారం, మే 26, 2020

ఏదో ఏదో అన్నది...

ముత్యాల ముగ్గు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్      
సాహిత్యం : ఆరుద్ర
గానం : రామకృష్ణ

ఏదో ఏదో అన్నది..
ఈ మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..
కొత్త పెళ్ళికూతురు..ఊ

ఏదో ఏదో అన్నది..
ఈ మసక మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..
కొత్త పెళ్ళికూతురు..ఊ

ఒదిగి ఒదిగి కూచుంది..
బిడియపడే వయ్యారం..
ముడుచుకునే కొలది
మరీ మిడిసి పడే సింగారం..
సోయగాల విందులకై..
వేయి కనులు కావాలీ..
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

ఏదో ఏదో అన్నది..
ఈ..మసకవెలుతురు..
గూటి పడవలో విన్నది..
కొత్త పెళ్ళికూతురు..


నింగిలోని వేలుపులు..
ఎంత కనికరించారో..ఓ..ఓ
నిన్ను నాకు కానుకగా...
పిలిచి కలిమి నొసగేరూ..ఊ..ఊ
పులకరించు మమతలతో..
పూల పాన్పు వేశారూ..
ఊ..ఊఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

ఏదో ఏదో అన్నది.. 
ఈ మసక మసకవెలుతురు..ఊ
గూటి పడవలో విన్నది..
కొత్త పెళ్ళికూతురూ..ఊ
ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

 

4 comments:

Thank you for reminding about this song. The lyrics, the tune, and the setting make this one of the memorable songs. Here are two extra charanams I wrote to the same tune. Hope you like.


నీట నీదు మోము జూచి కలువభామ విరిసేను
నింగిలోని కలువరేడు దానికెంతొ కినిసేను
పరిహసాల పరిమళాల జగతి ఎంతొ మురిసేను .. ఏదో

ప్రణయరాగ స్వరములేవొ గళమునందు వేచేను
హృదయవీణ తంత్రులన్ని స్వాగతమ్ము తెలిపేను
మనసులోని కోయిలమ్మ మోహనముగ పలికేను.. ఏదో


థ్యాంక్స్ ఎ లాట్ అజ్ఞాత గారూ.. మీరు వ్రాసిన చరణాలు కూడా చాలా బావున్నాయండీ.. ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

There is timeless magic in this song. ఇదే చిత్రంలోని నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది గీతం అయితే తెలుగు అత్యుత్తమ సినీ గీతాలలో మొదటి వరుసలో ఉంటుంది వేణు గారు.

అందులో ఏ సందేహం లేదండీ.. నిదురించే తోటలోకి పాట ఆల్రెడీ ఈ బ్లాగ్ లో పంచుకున్నానండీ.. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్.. https://sarigamalagalagalalu.blogspot.com/2014/08/blog-post_30.html

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.