శుక్రవారం, మే 15, 2020

చందమామ రమ్మంది...

అమాయకుడు చిత్రం నుండి ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమాయకుడు (1968)
సంగీతం : బి. శంకర్
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

చందమామ రమ్మంది చూడు
చల్లగాలి రమ్మంది చూడూ..
ఆ పైన.. ఇంక ఆ పైన..
నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ

చందమామ బాగుంది నేడు
చల్లగాలి బాగుంది నేడు
ఏముంది.. ఇంక ఏముంది..
అది అంతే కదా ఏనాడు
చందమామ బాగుంది నేడు

పువ్వులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పువ్వులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవూ
తెలుపగాలేను నేను

చందమామ రమ్మంది చూడూ

పువ్వులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పువ్వులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు
నాది నీ దారి కాదు

చందమామ బాగుంది నేడు

చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు

చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు
ఆ మాటే తగదన్నాను

చందమామ రమ్మంది చూడు
చల్లగాలి రమ్మంది చూడు
ఆ పైన.. ఇంక ఆ పైన..
నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు
 
Add caption

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.