గూఢాచారి 116 సినిమాలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గూఢాచారి 116 (1966)
సంగీతం : టి.చలపతిరావు 
సాహిత్యం : సినారె 
గానం : ఘంటసాల, సుశీల 
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. 
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. 
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
ముద్దబంతిలా ఉన్నావు.. 
ముద్దులొలికిపోతున్నావు..
ముద్దబంతిలా ఉన్నావు.. 
ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని 
చిలిపి సైగలే చేసేవు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. 
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
చల్లచల్లగ రగిలించేవు.. 
మెల్లమెల్లగ పెనవేసేవు..
చల్లచల్లగ రగిలించేవు.. 
మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి 
నా సిగ్గు దొంతరలు దోచేవు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. 
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే.. 
నిన్నలా చూస్తుంటే..
 


 
 


 
 
2 comments:
బ్యూటిఫుల్ సాంగ్..యాప్ట్ పిక్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.