ఆదివారం, ఫిబ్రవరి 16, 2020

చిగురులు వేసిన కలలన్నీ...

పూలరంగడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూలరంగడు (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల, కె.బి.కె.మోహనరాజు 

చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి..
మమతల తీరంచేరినవి..

ఆ.ఆ.ఓ...ఓ...ఓ

సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను

నిండు మనసు పందిరి కాగా
నిన్ను అందుకున్నాను..
నిన్నే అందుకున్నాను...

చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి


దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...


చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే

పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే
కరిగించిన చెలియవు నీవే..
కరగించిన చెలియవు నీవే

చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ
మమతల తీరం చేరినవి
మమతల తీరంచేరినవి

ఆ.ఆ.ఓ...ఓ...ఓ 


6 comments:

Golden classic. సుశీలమ్మ గారి గాత్రం అమృత ప్రాయం. రాజేశ్వర రావు గారు అందించిన ఆణిముత్యం.

పాటలో వాయిద్యాలు వాడిన తీరు ముఖ్యంగా తబలా unobtrusive గా వాడిన తీరు ఆకట్టుకుంటుంది.

థ్యాంక్స్ అజ్ఞాత గారూ..

ఈ పాటను పాడింది పి.బి.శ్రీనివాస్ గారు కాదనుకుంటానండి. కె. బి. కె. మోహన్ రాజు (కొండా బాబూ కృష్ణమోహన్ రాజు) గారు అన్నట్లుగా వికీపీడియా చెప్తుంది.

అవును భవానీ ప్రసాద్ గారు.. పోస్ట్ లో అప్డేట్ చేశానండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

చాలా అందమైన పాట..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.