బుధవారం, ఫిబ్రవరి 05, 2020

బిడియమేలా.. ఓ చెలి..

ఎస్.రాజేశ్వరరావు గారు స్వరపరచిన ఒక మధురగీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆదర్శ కుటుంబం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె   
గానం : ఘంటసాల, సుశీల

బిడియమేలా.. ఓ చెలి..
పిలిచె నిన్నే.. కౌగిలి..
మొదటిరేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో.. ఎందుకో

హా.. అదే తెలియదు ఎందుకో
బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో

కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన
కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన

పదము రాక.. కదలలేక
ఒదిగి ఉన్నాను ఈ వేళ
ఒదిగి ఉన్నాను ఈ వేళ
నిలువలేను... పిలువలేను
ఊ...ఊ..

బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో

శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను
శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను

కలల దారి చెలుని చేరి
కరిగిపొవేమి నీవనెను
కరిగి పొవేమి నీవనెను
మరులు పూచే... మనసు వీచే
ఊ...ఊ..

బిడియమేలా... ఓ చెలి ఊ..
పిలిచె నిన్నే.. కౌగిలి..ఊహూ..
మొదటి రేయి అఆ.. ఒదిగిపోయి..ఆఅ..
మోము దాచేవెందుకో... ఎందుకో
2 comments:

హార్ట్ టచింగ్ సాంగ్..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.